గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రియమణి…

ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో నటి ప్రియమణి పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి కాదంబరి కిరణ్‌ ఆధ్వర్యంలో మధురైలోని కోయిల్‌పట్టిలో శుక్రవారం రోజు ప్రియమణి మొక్కలు నాటారు. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, కెమెరామెన్‌ శ్యాం కే నాయుడు, నటుడు రామరాజు, మూవీ యూనిట్‌ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ.. గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు దయచేసి అందరూ మొక్కలు నాటాల్సిందిగా ఆమె కోరారు. పెళ్లి రోజు, పుట్టిన రోజులకి బహుమతులు కాకుండా మొక్కలు నాటించాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వారిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని పేర్కొన్నారు.