అల్లర్లకు బీజేపీయే కారణం :ఆప్ నేత సంజయ్ సింగ్

ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు బీజేపీయే కారణమన్నారు ఆప్ నేత సంజయ్ సింగ్. అల్లర్ల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సంజయ్..బీజేపీ ద్వంద వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒకవైపు అల్లర్లపై హోంమంత్రి సమీక్ష చేస్తుంటే..మరోవైపు బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కపిల్ మిశ్రా వ్యాఖ్యలు అల్లర్లు మరింత బలాన్ని ఇచ్చాయన్నారు. ఢిల్లీ శాంతిభద్రతలు కేంద్రహోంశాఖ ఆధీనంలోనే ఉన్నాయన్న సంజయ్..ఈశాన్య ఢిల్లీలో అల్లర్లను అదుపుచేయలేకపోయిందన్నారు. హిందూ, ముస్లింలు, పోలీసులు పలువురు మృతి చెందారని అన్నారు. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..పరిస్థితిని అదుపులోకి తేచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.