9.55సెకన్స్‌ లో 100మీటర్లు పరుగెత్తిన శ్రీనివాస గౌడ

ఇండియాలో జమైకా చిరుతను మీరెప్పుడైనా చూశారా..? పరుగుల వీరుడు ఉసెన్‌ బోల్డ్‌ ను తలదన్నే యోధుడు కర్ణాటకలో ఉన్నాడని విన్నారా..? అవును 9.58సెకన్స్‌ లో బోల్ట్‌ 100మీటర్లు పరుగెడితే.. కంబళ ఉత్సవంలో శ్రీనివాస గౌడ అనే యువకుడు 9.55సెకన్స్‌ లో లక్ష్యాన్ని చేదించాడు. సోషల్‌ మీడియాలో స్టార్‌ గా మారిన శ్రీనివాస్‌ ఫీట్‌ అఫీషియల్‌ గా డిక్లేర్‌ అయితే..విశ్వచిరుతగా మనోడి పేరు చరిత్రలో నిలుస్తుందంటున్నారు కన్నడీయులు.