25న కార్పొరేట్లతో ట్రంప్‌ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనకు వస్తున్న క్రమంలో ఇక్కడి ప్రముఖ కార్పొరేట్లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. ట్రంప్‌తో జరగబోయే ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, టాటా సన్స్‌ ఛైర్మన్‌  చంద్రశేఖరన్‌, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయి. రెండు దేశాల మధ్య మెరుగైన వాణిజ్య-వ్యాపార సంబంధాలు కొనసాగేలా చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా  తెలుస్తోంది.