2000కు చేరినా కరోనా వైరస్‌ మృతుల సంఖ్య

చైనాలో కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2000కి చేరింది. నిన్న ఒక్కరోజే 1749కొ్త్త కేసులు నమోదు కాగా..ఇప్పటి వరకు వైరస్‌ తో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 74వేలకు చేరింది.వీరిలో 20వేలమందికి పైగా రోగుల పరిస్థితి విషమంగా ఉన్న చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే సమస్య తీవ్రత తగ్గినా రోజు రోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.