1519కి చేరిన కరోనా మృతుల సంఖ్య

చైనాను కరోనా కలవర పెడుతోంది. కరోనా దాటికి ఇప్పటి వరకు 1519మంది మృతి చెందగా నిన్న ఒక్కరోజే 139మంది మరణించారు.వైరస్‌ బారిన పడి 66వేల మంది చికిత్స పొందుతుండగా.. నిన్న 2600కొత్త కేసులు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా ఇటు వైద్య సిబ్బందినీ బలి తీసుకుంటోంది. వందలు, వేల కొద్దీ బాధితులను పరీక్షిస్తుండటం.. మాస్కులు, బాడీ సూట్స్‌ వంటి రక్షణ సామగ్రి సరిపడా లేకపోవడంతో వైరస్‌ బారినపడుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ -19 కారణంగా ఆరుగురు ఆరోగ్య కార్యకర్తలు మృతి చెందగా.. 1,716 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది.ఇక డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో పది మంది పరిస్థితి విషమంగా ఉండగా.. ఈజిప్ట్‌ లో మొదటి కరోనా వైరస్‌ గుర్తించినట్టు ప్రకటించారు అధికారులు