1483కు చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్-19 వైరస్ కారణంగా చైనాలో గురువారం ఒక్కరోజే 116మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 1483కు చేరింది. 4823 నూతన కేసులు నమోదయ్యాయని.. మొత్తంగా 64,600 మందికి వ్యాధి లక్షణాలు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. సరైన సమయంలో చికిత్స అందించేందుకు వీలుగా వ్యాధి నిర్ధరణ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు హూబీ అధికారులు. అయితే చైనా అధికారులు ప్రకటించిన దానికంటే ఎక్కువగానే వ్యాధి ప్రబలుతున్నట్లు సమాచారం.