స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 10 పాయింట్లు లాభపడి 41 వేల 331 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 12 వేల 130 దగ్గర కొనసాగుతోంది.  కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ దాదాపు 3శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా రంగం 1శాతం లాభాల్లో ఉండగా.. ఆర్థిక సేవల రంగం 0.3శాతం లాభపడ్డాయి. చైనాలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో అమెరికా, యూరప్‌ మార్కెట్లు లాభపడ్డాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. జపాన్‌ సూచీలు 1.5శాతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సూచీలు రికార్డు స్థాయిలకు చేరుకొన్నాయి.