స్టూడెంట్‌ వీసాలపై ట్రంప్‌ షాక్‌

అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం షాక్‌ ఇవ్వనుంది. విద్వార్థి వీసాలకు నిర్దిష్ట కాలావధి నిర్ణయించనుంది. ఇప్పటిదాకా వారి డిగ్రీ పూర్తయ్యేదాకా వీసా ఉండేది. అది పూ ర్తయ్యాక అనుబంధ డిగ్రీ పట్టా సాధించుకునేందుకు పొడిగింపు కూడా ఇచ్చేవారు. ఇకపై అలా కుదరదు. వీసా ప్రారంభ తేదీ-ముగింపు తేదీ అని దరఖా స్తులో స్పష్టంగా పేర్కొంటారు. ఆ ముగింపు తేదీలోగా పెట్టే బేడా సర్దుకుని వచ్చేయాలి. చాలా మంది విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకున్నాక కూడా వేరే వీసాలకు మారకుండా అదే వీసాలపై కొనసాగుతుండడంతో ఈ కొత్త రూల్‌ తెచ్చారు. అటు ఈ రూల్స్ ను ఇమిగ్రేషన్‌ ఏజెన్సీలు తప్పుబడుతున్నాయి.