సాయిబాబా ఆలయానికి యాచకుడి రూ. 8 లక్షల విరాళం

అతనో యాచకుడు, కానీ ఆయన మనస్సు మాత్రం ఉన్నతమైనది, గుడి మెట్ల దగ్గర కూర్చొని భక్తుల దగ్గర డబ్బులు యాచించి ఏకంగా సాయిబాబా ఆలయానికి రూ. 8 లక్షల విరాళం ఇచ్చిన ఘటన విజయవాడలోని సాయిబాబా ఆలయంలో చోటు చేసుకుంది.

అతను దాదాపు నాలుగు దశాబ్దాలుగా రిక్షా- పుల్లర్‌గా జీవనం సాగించిన యాదిరెడ్డి మోకాలు నొప్పితో యాచకుడిగా మారాడు. మొదట యాదిరెడ్డి సాయిబాబా ఆలయానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.  ఆలయానికి విరాళం ఇవ్వడం ప్రారంభించిన తర్వాత క్రమంగా యాదిరెడ్డి ఆదాయం పెరిగింది. అలాగే ఆయనకు ప్రజల్లో గుర్తింపు కూడా లభించింది. దీంతో నా సంపాదన అంతా ఆలయానికి అందజేస్తానని యాదిరెడ్డి ప్రమాణం చేసినట్లు అక్కడి ఆలయ అధికారులు వివరించారు.

అలాగే.. యాదిరెడ్డి సహాయంతో గోషాల నిర్మించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలాయానికి 8 లక్షల విరాళం ఇచ్చి ఆయన చేసిన కృషిని వారు అభినందించారు. కానీ ఇప్పుడు ఎలాంటి విరాళం కోరడం లేదని అయినా నగరం చుట్టూ ఉన్న ప్రజలు తమ సొంతంగా విరాళం అందజేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.