షిప్‌ లో ఉన్న ప్రయాణీకులకు విముక్తి!

జపాన్‌ తీరంలో నిలిచిపోయిన నౌకలో ఉన్నవారికి ఎట్టకేలకు విముక్తి లభించింది. గత 14 రోజులుగా షిప్‌ లో ఉన్న పలువురిని బయటకు పంపించారు. వీరిలో ఇప్పటి వరకు 542 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. పలు దఫాల వైద్య పరీక్షల అనంతరం వైరస్ ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత 500 మందిని నౌక నుంచి బయటకు పంపించారు. మరో 300 మంది అమెరికన్లను ఆ ప్రభుత్వం ఇప్పటికే సొంతదేశానికి తీసుకెళ్లింది. మరికొంత మందిని త్వరలో విడిచిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.