శ్రీవారి సన్నిధిలో జాన్వీకపూర్

తిరుమల శ్రీవారిని శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి ఝాన్వీ కపూర్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో  శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఝాన్వీ కపూర్. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు ఝాన్వీ కపూర్ కి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.