శ్రీనివాసగౌడను ఇండియన్ బోల్ట్‌ లా తయారు చేస్తాం

కర్ణాటక జమైకా చిరుతకు కేంద్రం నుంచి పిలుపొచ్చింది. పరుగుల వీరుడు ఉసెన్‌ బోల్డ్‌ ను తలదన్నే యోధుడు శ్రీనివాస గౌడను అభినందనలతో ముంచెత్తారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో గౌడకు కోచింగ్‌ ఇప్పించనున్నట్టు చెప్పారు. శ్రీనివాసను ఒలింపిక్స్‌ కు పంపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామాల్లో క్రీడలపై అవగాహన కల్పించి మట్టిలో మాణిక్యాలను వెలిక్కి తీస్తామని చెప్పారు. ఇప్పటికే సోషల్‌ మీడియా స్టార్‌ గా మారిన శ్రీనివాస్‌ ఫీట్‌ అఫీషియల్‌ గా డిక్లేర్‌ అయితే.. విశ్వచిరుతగా మనోడి పేరు చరిత్రలో నిలవనుంది.