శబరిమల కేసు విచారణ మరో ధర్మాసనానికి బదిలీ

శబరిమల కేసును సుప్రీం కోర్టు మరో బెంచ్‌కి బదిలీ చేసింది. ఐదుగురు సభ్యుల బెంచ్‌కు ఉన్న పరిమిత అధికారాల దృష్ట్యా ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలను మరో ధర్మాసనం విచారిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డేతో కూడిన ఈ ప్రత్యేక ధర్మాసనం మతవిశ్వాసాలకు సంబంధించిన ఏడు అంశాలను రూపొందించింది. ఈ అంశాలను తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాససం విచారిస్తుందని ప్రకటించింది.