శంషాబాద్ ఎయిర్ పోర్టు లో బంగారం పట్టివేత

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దోహా నుంచి వచ్చిన ప్రయాణికులను తమ విధిలో భాగంగా కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 600 గ్రాముల బంగారం లభ్యమయింది. బంగారానికి సంబంధించి.. ఆధారాలు చూపించమని కస్టమ్స్‌ అధికారులు, సదరు ప్రయాణికులను ప్రశ్నించగా.. వారి వద్ద నుంచి సమాధానం రాలేదు. దీంతో, సదరు వ్యక్తులు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ధృవీకరించుకున్న అధికారులు.. వారిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించి. విచారణ కొనసాగుతోంది.