శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 11 లక్షల  రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.  ఉదయం దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన  ఓ మహిళా ప్రయాణికురాలిని తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది ఆమె దగ్గర బంగారం ఉన్నట్లు గుర్తించారు. మహిళను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా లోదుస్తులు, షూల్లో పెట్టిన 290 గ్రాముల బరువున్న రెండు బంగారం బిస్కెట్లు, ఆభరణాలు బయటపడ్డాయి. దీంతో ప్రయాణీకురాలిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.