లాసెట్‌-2020 షెడ్యూల్‌ విడుదల

లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యుల్‌ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 6వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 20వ తేదీ వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంటుంది. మే 27న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.