లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 165 పాయింట్లు లాభపడి 41 వేల 624 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 49 పాయింట్లు ఎగబాకి 12 వేల 224 దగ్గర  ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71 రూపాయల 22 పైసలుగా  కొనసాగుతోంది. బ్యాంకింగ్‌, ఐటీ కంపెనీల షేర్లు పుంజుకోవడమే సూచీల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బీజీసీఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, గెయిల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.