రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యం :ఎమ్మెల్యే రసమయి

రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రైతు అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఇప్పటికే రైతులకు 24 గంటల కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీళ్లు ఇస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ గ్రామ చెరువులో 365 రోజులు నీళ్లు ఉండేలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. కరీంనగనర్‌ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల ప్రమాణస్వీకరోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హాజరయ్యారు. అనంతరం… చెంజర్ల గ్రామంలో తెలంగాణ అమరవీరులు సుధగోని రాజేశ్ గౌడ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో.. కరీంనగర్ సుడా చైర్మన్ జీవీరామకృష్ణారావు, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.