రూ.44 వేలు దాటిన బంగారం ధర

కొద్ది రోజులుగా రాకెట్‌లా దూసు కెళ్తున్న పుత్తడి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌ మార్కె ట్‌లో 44 వేల రూపాయలు దాటింది.  10 గ్రాములకు 44 వేల 430 రూపాయల ధర పలుకుతోంది. గత వారం రోజుల్లో హైదరాబాద్‌లో మేలిమి బంగారం ధర పది గ్రాములకు 17 వందల 90 రూపాయలు పెరిగింది. ఈ నెల 17న 10 గ్రాముల బంగారం ధర 42 వేల 640 రూపాయలు పలకగా 23న  44 వేల 430కి చేరింది.  కరోనా వైరస్ కారణంగా వాణిజ్య రంగంలో ఒడిదుడుకుల ను తట్టుకొనేందుకు పెట్టుబడిదారులు బంగారం కొనుగోలుచేస్తున్నారు. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండటం ధరలు పెరగడా నికి కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతు న్నాయి.