రన్నింగ్‌ ట్రాక్‌ ఎక్కనున్న ఇండియన్‌ ఉసెన్‌ బోల్ట్‌

ఇండియన్‌ ఉసేన్‌బోల్ట్‌ రన్నింగ్ ట్రాక్ ఎక్కనున్నాడు. కంబళ పోటీల్లో ప్రపంచ పరుగుల చిరత కంటే వేగంగా పరుగెత్తి రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస గౌడ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనున్నాడు. శాయ్‌ అధికారులు బెంగళూరులో శ్రీనివాసకు శిక్షణనివ్వనున్నారు. ఈ ఏడాది కంబళ పోటీలు ముగిశాక, ఏప్రిల్‌లో శ్రీనివాస శిక్షణ కేంద్రంలో చేరే అవకాశముంది. మూడుబిద్రిలో నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస ఈ ఏడాది కంబళ పోటీల్లో ఏకంగా 39 పతకాలు కైవసం చేసుకోవడం విశేషం.