మాలిలో ఉగ్రవాదుల దాడి, 30మంది మృతి

ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఒగొసాగౌలో దాడులకు పాల్పడిన టెర్రరిస్టులు తొమ్మిది మంది సైనికులతో పాటు 30మందిని పొట్టన పెట్టుకున్నారు. మరో 20మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్స్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒగొసాగౌతో పాటు బిన్టియా, మోండోరో సైనిక శిబిరంపై ఏకకాలంలో దాడులకు పాల్పడింది