మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 ప్రయోగం

శ్రీహరి కోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి వచ్చే నెల 5న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జీఎస్‌ఎల్‌వీ రాకెట్ అనుసంధానం పూర్తి కావచ్చింది. ఉపగ్రహాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10  ద్వారా 2 వేల 300 కిలోల బరువు గల గీశాట్‌-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఉపగ్రహ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంధనం నింపే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే వచ్చే నెల 5న సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.