మళ్లీ ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడిగా అష్రఫ్‌ ఘని

అఫ్ఘనిస్థాన్‌ అధ్యక్ష పదవి మళ్లీ అష్రఫ్‌ ఘనిని వరించింది. ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన రెండోసారి ఘన విజయం సాధించారు. రాజకీయ ప్రత్యర్థి, నేషనల్‌ కొలీషన్‌ పార్టీ అభ్యర్థి అబ్దుల్లాపై 30శాతం ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రధానాధికారి హావా ఆలమ్‌ నూరిస్థానీ వెల్లడించారు. దీంతో ఘని అఫ్ఘాన్‌ అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణం చేయనున్నారు. అయితే ఈఎన్నికల్లో ఘనీ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అబ్దుల్లా ఆరోపించారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో 3లక్షల నకిలీ ఓట్లు నమోదయ్యాయని విమర్శించారు