మనిషి బ్రతకడానికి మొక్కలు చాలా అవసరం..

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో సినీ దర్శకులు వి.వి. వినాయక్‌ పాల్గొన్నారు. వినాయక్‌ తన ఆఫీసులో మొక్కలు నాటి సెల్ఫీ దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనిషి బతకడానికి మొక్కలు ఎంతో అవసరమని అన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న సంతోష్‌ కుమార్‌కు వినాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇక వినాయక్‌ మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌, సినీ నిర్మాతలు నల్లమల బుజ్జి, మల్లిడి సత్యనారాయణరెడ్డికి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.