భువనగిరిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం…

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరి గుట్ట పై ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరిస్తారో…? లేదో..? అని బయపడి ఆత్మహత్యయత్నం చేసినట్లుగా తెలిసింది. వీరిని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గుకు చెందిన తౌట స్వాతి, కోడూరి నవీన్ గా గుర్తించారు. నవీన్ ఆత్మహత్య విషయాన్ని తన స్నేహితుడికి చెప్పగా.. అతడు పోలీసులను సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. నవీన్, స్వాతిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో.. వారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.