భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నాలుగురోజుల పాటు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 225 పాయింట్లు లాభపడి 41 వేల 119 దగ్గర  కొనసాగుతోంది. నిఫ్టీ 68 పాయింట్లు ఎగబాకి 12 వేల 60 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఓ దశలో సెన్సెక్స్‌ 408 పాయింట్లు లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.39 రూపాయలుగా కొనసాగుతోంది. కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం సూచీల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టాటా మోటార్స్, యస్ బ్యాంక్‌, బ్రిటానియా, యూపీఎల్‌, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.