భారత్ పై న్యూజిలాండ్ విజయం

న్యూజిలాండ్‌ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. 274 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో  ఇండియా బ్యాట్స్‌ మెన్స్‌ మరోసారి తడబడ్డారు. 48.3 ఓవర్లకు 251 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యారు.  శ్రేయస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ తప్ప మిగతా బ్యాట్స్ మెన్స్ అంతా చేతులెత్తేశారు. దీంతో మూడు వన్డేల సిరీస్ లో న్యూజిలాండ్ 2 – 0 ఆధిక్యాన్ని సంపాదించి సిరీస్‌ ను కైవసం చేసుకుంది.