భారత్ కు ట్రంప్‌ షాక్‌

పర్యటనకు ముందే అమెరికా అధ్యక్షుడు ఇండియాకు షాకిచ్చారు. భారత్‌ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూనే ..ఈ పర్యటనలో ఎలాంటి ధ్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు ఉండవని స్పష్టం చేశారు. భారత్‌ తో ట్రేడ్‌ డీల్స్‌ కు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. అది అధ్యక్ష ఎన్నికల తరువాత ఆలోచిస్తామని తెలిపారు. మోడీతో మా మైత్రి చిరకాలం కొనసాగుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల్లో భారత్‌ రానున్న ట్రంప్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసింది కేంద్రం. ఇటు గుజరాత్ సర్కార్‌ ట్రంప్‌ 3గంటల పర్యటన కోసం అహ్మదాబాద్‌ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది.