బాలీవుడ్‌ మూవీపై ట్రంప్‌ ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బాలీవుడ్ మూవీ శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ పై ప్రశంసలు కురిపించారు.  స్వలింగ సంపర్కం అనే కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ సినిమా గ్రేట్‌ అంటూ ట్వీట్‌ చేశారు ట్రంప్‌. అమెరికాకి చెందిన గే ఉద్య‌మ కారుడు పీట‌ర్‌ ట్వీట్‌ కు ట్రంప్‌ సమాధానమిచ్చారు. త‌మ సినిమాపై ట్రంప్ స్పందించ‌డంపై చిత్ర బృందం ఆనందం వ్య‌క్తం చేస్తుంది. ఈ చిత్రంలో గే గా ఆయుష్మాన్ నటిస్తే.. జితేంద్ర కుమార్ ఆయుష్మాన్‌కు ప్రియుడి పాత్రలో నటించారు.