ఫిబ్రవరి 24-25 తేదీల్లో ట్రంప్‌ భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. మెలానియాతో కలిసి భారత్‌కు రానున్న ట్రంప్‌.. ఢిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చైనాతో తొలి దశ ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప్‌ భారత్‌తోనూ ఆ తరహా విధానానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అలాగే చైనా, పాకిస్థాన్‌, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌లో తాజా పరిస్థితులతో పాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రతపై ప్రధానంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆయిల్, నేచురల్ గ్యాస్ సరఫరా భద్రతపై అమెరికా నుంచి భారత్‌ హామీ కోరేందుకు యత్నిస్తోంది. పలు సైనిక కొనుగోలు ఒప్పందాలు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది.