ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈనెల 8న 70 స్థానాలకు పోలింగ్‌ జరుగగా, ఇవాళ ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్ కు అన్నీ ఏర్పాట్లు చేసిన ఈసీ, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నంవరకు బరిలో నిలిచిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 21 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. లెక్కింపు ప్రక్రియను పరిశీలించడానికి 33 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో నిలువగా, ఆప్, బీజేపీ ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.