పోలీసు నియామకాల్లో అవకతవకలు అవాస్తవం

తెలంగాణ పోలీసు శాఖపై ఓ పత్రికలో వచ్చిన అసత్య కథనాలను సీపీ అంజనీ కుమార్ తీవ్రంగా ఖండించారు. పోలీసు నియామకాల్లో అవకతవకలు అవాస్తమని తేల్చిచెప్పారు. తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరుందని స్పష్టం చేశారు. దాన్ని డ్యామేజీ చేసేలా .. విషపు కథనాలు రాయడం ప్రాతికేయ ప్రమాణాలను దిగజార్చడమేనన్నారు. తెలంగాణ పోలీసులు  నేర పరిశోధనలో ఇతర రాష్ట్రాలకు కూడా సాయం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పోలీసు శాఖకు ఎన్నో అవార్డులొచ్చాయని సీపీ అంజనీ కుమార్ గుర్తు చేశారు.