పూల్వామా ఉగ్రదాడికి నేటీతో ఏడాది పూర్తి

పూల్వామా ఉగ్రదాడి జరిగి నేటీకి ఏడాది పూర్తయ్యింది. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్ముకశ్మీర్‌ లోని లెత్‌ పొరా శిబిరంలో స్మారకస్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ స్థూపంపై 40 మంది జవాన్ల పేర్లు, ఫొటోలను ముద్రించారు. అమరువీరులకు ఇదే అసలైన నివాళి అని సీఆర్పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జుల్ఫికర్‌ హసన్‌ అన్నారు. పుల్వామా దాడి జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ అమరులకు నివాళులర్పించారు. వారి త్యాగాన్ని భారత్‌ ఎన్నటికీ మరిచిపోదని ట్విట్టర్ లో  తెలిపారు.