పుల్వామా దాడి వల్ల ఎవరు లాభ పడ్డారు..!

పుల్వామా ఘటనపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా కేంద్రానికి ప్రశ్నలు సందించారు.   40 మంది జవాన్లు బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు లాభ పడ్డారని ప్రశ్నించారు. విచారణలో ఇప్పటి వరకు ఏం తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.  భద్రతా వైఫల్యానికి బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలన్నారు. దాడి  జరిగి ఏడాది కావొస్తున్నా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ ప్రశ్నించారు.