పాతబస్తీలో దారుణం..తల్లీకుమార్తె హత్య.!

చాంద్రాయణగుట్ట పీఎస్పరిధిలోని తడ్లకుంటలో దారుణం చోటు చేసుకుంది, నగరంలోని పాతబస్తీలో తల్లీకుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. ఘాజీమిల్లత్నల్లవాగులోని ఇంట్లో వీరు హత్యకు గురయ్యారు. తల్లి సాజితాబేగం(60), కుమార్తె ఫరీదాబేగం(32) తెల్లవారుజామున హత్యకు గురైనట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సాజితాబేగం భర్త దుబాయిలో ఉంటున్నాడు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అప్పు ఇచ్చిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.