పరుగులు పెడుతున్న పసిడి ధరలు

కొద్దిరోజులుగా దిగివస్తున్న పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ మెరుపులతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ. 41,000కు చేరింది. హైదరాబాద్‌ మార్కెట్లో 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్‌ రూ. 42,350కు చేరగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 40,000 పలుకుతోంది. ఇటు, వెండి ధరా కూడా మండిపోతోంది. కిలో వెండి ఏకంగా రూ. 222 భారమై రూ 46,345కి చేరింది. ఇక ఈ ఏడాది బంగారం ధరలు రూ.50,000ల మార్కును దాటొచ్చంటున్నారు బులియన్‌ నిపుణులు.