నకిలీ వీసాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నకిలీ వీసాలు తయారు చేస్తున్న ముఠా సభ్యులను శంషాబాద్‌ ఎస్‌వోటీ బృందం అదుపులోకి తీసుకుంది. నకిలీ వీసాలు తయారు చేసి దుబాయ్‌, కువైట్‌ తో పాటు ఇతర దేశాలకు 30 మంది అమాయకులను పంపినట్లు గుర్తించారు. శంషాబాద్‌ విమానాశ్రయం కేంద్రంగా ఈ దందా కొనసాగించారు. ఏడుగురు ముఠాసభ్యులను అరెస్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 16 పాస్‌పోర్టులు, 13 నకిలీ వీసాలు, 23 స్టాంప్‌ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.