త్వరలో స్క్రాపింగ్‌ పాలసీకి కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్!

కేంద్రం రూపోందిస్తున్న స్క్రాపింగ్‌ పాలసీకి సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. మార్చిలో దీనికి కేబినెట్‌ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఫెడరేషన్‌ ఆఫ్ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సదస్సులో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.  స్క్రాపింగ్‌ పాలసీ రూపకల్పన తుదిదశకు చేరిందని చెప్పారు. కేబినెట్‌ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో ఈ పాలసీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించవచ్చన్నారు.