త్వరలో పట్టాలెక్కనున్న రామాయణ రైలు

రైల్లో ప్రయాణిస్తున్నా రామాలయంలోనే ఉన్నామన్న భావన కలిగించే ప్రత్యేక రైలు త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. దేశంలోని ప్రముఖ రామాలయాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణం సాగిస్తుంది. మార్చి 10 తర్వాత రామాయణ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. దేశం నలుమూలలకూ ఈ రైలు వెళ్తుందన్నారు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌. బోగీలన్నింటిల్లో రామాయణగాథ థీమ్‌ అలంకరణ ఉంటుందని చెప్పారు. భజనలు కూడా వినిపిస్తాయని వీకే యాదవ్‌ తెలిపారు.