తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే భారత్ ఆలౌట్‌

వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ 165 ప‌రుగుల‌కే ఆలౌటైంది.  తొలి రోజు 122 ప‌రుగుల‌కు అయిదు వికెట్లు కోల్పోయిన భార‌త్‌.. రెండ‌వ రోజు మ‌రీ పేల‌వంగా ఆడింది.  కేవ‌లం 43 ప‌రుగులు మాత్రమే జోడించి మ‌రో అయిదు వికెట్లను చేజార్చుకుంది. భారత  ఇన్నింగ్స్‌ లో ర‌హానే అత్యధికంగా 49 పరుగులు  చేశాడు.  చివ‌ర్లో ష‌మీ 21 ర‌న్స్ చేశాడు. కివీస్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథీ, జేమీస‌న్‌ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.