తనని గుర్తు పట్టలేదని పోలీస్‌ పై బీహార్‌ మంత్రి ఆగ్రహం

తనని గుర్తుపట్టని ఓ పోలీసుపై చిందులేశారు బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి. నన్నే గుర్తించని నిన్ను సస్పెండ్‌ చేయిస్తానంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. సివాన్‌ లో ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి మంగల్‌ పాండేను అక్కడి ఖాకీ గుర్తు పట్టలేదు. మంత్రిని అడ్డుకున్న పోలీస్‌..లైన్లో వెళ్లాలంటూ సూచించారు. దీంతో ఆగ్రహానికి లోనైన మంత్రి నోటికి పని చెప్పారు. చివాట్లు పెడుతూ నిమిషాల్లో చుక్కలు చూపించారు.