ట్రంప్ కార్యక్రమానికి 100కోట్లు ఎవరు ఇచ్చారు

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి 100 కోట్ల రూపాయలను ఏ మంత్రిత్వ శాఖ ఖర్చు చేస్తోందని ప్రశ్నించారు. అంతేకాకుండా నాగరిక్‌ అధినందన్‌ సమితి ట్రంప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్న ఆమె, ఈ సమితి సభ్యులకు ట్రంప్ కార్యక్రమం గురించి సరైన అవగాహనే లేదని ప్రియాంక విమర్శించారు. 100 కోట్ల రూపాయాల డబ్బు ఏ మంత్రిత్వ శాఖ నుండి ఖర్చు చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని అన్నారు. 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రియాంక గాంధీ ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు.