టెలికాం సంస్థలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

టెలికాం సంస్థలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎయిర్‌ టెల్, వోఢాపోన్‌, బీఎస్‌ఎన్ఎల్, రిలయన్స్, టాటా సంస్థలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో టెలికాం సంస్థలకు ఇచ్చిన కోర్టు నోటీసులను విస్మరించడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వానికి బకాయిపడ్డ 92 వేల కోట్లను మార్చి 17లోపు చెల్లించాలని సంస్థలను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి బకాయిపడ్డ నిధులను చెల్లించాలని కంపనీల సీఎండీలు, ఎండీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.