టెన్నిస్‌ కు గుడ్‌బై చేప్పిన షరపోవా

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి మరియా షరపోవా.. టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. రష్యాకు చెందిన షరపోవా ఇప్పటి వరకు.. ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. ఓ మేగజైన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన షరపోవా.. తక్షణమే టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నానని తెలిపింది. నిత్యం గాయాల కారణంగా మైదానంలో తన ఆటను పూర్తి స్థాయిలో ప్రదర్శించలేకపోతున్నానని ఆమె చెప్పింది. 32 ఏళ్ల షరపోవా.. భుజం నొప్పితో బాధ పడుతోంది. షరపోవా టెన్నిస్‌ కేరీర్‌ను 2003లో ఆరంభించింది. 2004లో 17 ఏళ్ల షరపోవా, ఎలాంటి అంచనాలు లేకుండా వింబుల్డన్‌లో అడుగుపెట్టి.. ఫైనల్‌ పోరులో టాప్‌స్టార్‌ సెరినా విలియమ్స్‌ ను వరుస సెట్లలో ఓడించి టెన్నీస్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.