టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

భారత్ -న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్ సమరం ప్రారంభమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌ బే ఓవల్‌ వేదికగా కొనసాగుతోంది. టాస్‌ గెలిచిన కివీస్‌ బౌలింగ్ ఎంచుకుంది. గాయంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన కేన్‌ విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌ సాధించి జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే 0-2తో సిరీస్‌ కోల్పోయిన భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు కివీస్‌ ఈ పోరులో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.