జమ్మూకశ్మీర్‌ లో ఎన్‌ కౌంటర్‌, ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఇవాళ మరో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లాలోని త్రాల్‌ ఏరియాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. త్రాల్‌ లో ఆర్మీ కూంబింగ్ చేస్తుండగా.. టెర్రరిస్టులు ఎదురుపడ్డారు. జవాన్ల రాకను గమనించి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన ముష్కరులను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలను ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. మిగత ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.