జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఉప ఎన్నికలు వాయిదా

జమ్మూ కశ్మీర్‌లో మార్చి 5 నుంచి నిర్వహించాల్సిన పంచాయతీ ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల అధికారులు తెలిపారు. ఖాళీగా ఉన్న దాదాపు 13 వేల పంచాయతీ స్థానాలకు మార్చి 5 నుంచి 20 వరకు 8 దశల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పంచాయతీ స్థానాలకు జరగవలసిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా సమస్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి అందిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.