చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు సర్నేనిగూడెం సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిస్తామని ముగ్గురూ కారులో వెళ్లారు. ఆచూకీ కోసం గాలిస్తుండగా వీరి కారు చెరువులో కనిపించింది. కారుతో పాటు మృతదేహాలను వెలికితీశారు.