చారిత్రక వార్నర్‌ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్న అమెజాన్‌ చీఫ్‌

ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌.. చారిత్రక వార్నర్‌ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్నారు. దీని విలువ సుమారు 12 వందల కోట్లు. ఒకప్పుడు ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌కు చెందినదీ ప్రాంతం. ఇప్పుడు మీడియా మొగల్‌ డేవిడ్‌ గెఫెన్‌ నుంచి బెజోస్‌ కొనుగోలు చేసినట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. బెవర్లీ హీల్స్‌ లో ఉన్న వార్నర్‌ ఎస్టేట్‌ 9 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. జార్జియన్‌ శైలి ప్రహరీతో ఉన్న ఈ ఎస్టేట్‌లో అతిథి గృహాలు, ఓ టెన్నిస్‌ కోర్టు, మరో గోల్ఫ్‌ కోర్స్‌ ఉన్నాయి. 1930లో ఈ ఎస్టేట్‌ను నిర్మించారు. అటు బెజోస్‌ సంపద విలువ భారత కరెన్సీలో సుమారు 8 లక్షల కోట్లు.